11 గంటలకు 57.1% పోలింగ్ నమోదు
NGKL: నాగర్ కర్నూల్ మండలంలో ఉదయం 11 గంటలకు 57.1% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 19,648 ఓట్లు పోల్ కాగా అందులో పురుషులు 9,721, మహిళలు 9,927 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.