ఈ నెల 6న పెద్ద ఎత్తున మహా పడిపూజ..!
MDCL: జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తా వద్ద టీఎన్‌ఆర్ నార్త్ సిటీ మాల్ ప్రక్కన డిసెంబర్ 6న 18 పడుల మహా పడిపూజ ఏర్పాట్లను ఎమ్మెల్యే వివేకానంద, ఏసీపీ వెంకట్ రెడ్డి, అధికారులతో కలిసి ఇవాళ పరిశీలించారు. భారీగా అయ్యప్ప భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో వారికి అసౌకర్యం లేకుండా తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.