ముంపు ప్రాంతాలను పరిశీలించినున్న మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కొల్లిపర మండలంలోని కరకట్ట సమీప లంక గ్రామాలకు చేరుకొని అక్కడ వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం 1.30 గంటలకు తెనాలి మండలంలోని ఐతానగర్ సమీప గోలిడొంక ప్రాంతంలో నీట మునిగిన వరి పంట పొలాలను మంత్రి పరిశీలించనున్నారు.