నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NDL: డోన్లోని 1వ ఫీడర్ కింద 11కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర తెలిపారు. మహాలక్ష్మి హాస్పిటల్, పండరీనగర్, శ్రీకృష్ణ నగర్, కురుకుందు కాలనీ, శ్రీరామటాకీస్, కేవీఎస్ హాస్పిటల్, గర్ల్స్ హైస్కూల్, చాకిరేవు మిట్ట ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నామన్నారు.