ఎల్లారెడ్డి బీసీ సంఘం ఇన్‌ఛార్జ్‌గా సంతోష్

ఎల్లారెడ్డి బీసీ సంఘం ఇన్‌ఛార్జ్‌గా సంతోష్

KMR: ఎల్లారెడ్డి మండల బీసీ సంక్షేమ సంఘం ఇన్‌ఛార్జ్‌గా సంతోష్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు శంకర్ నియామక పత్రం అందజేశారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. బీసీ కులస్థులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.