నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: ఏలేశ్వరం మండలం ఎర్రవరం సబ్ స్టేషన్ పరిధిలో ఆర్.డీ.ఎస్.ఎస్ పనుల వల్ల సోమవారం తిరుమల గ్రామంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ వీరభద్రరావు తెలిపారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. పనులు ముగిశాక విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని తెలిపారు.