VIDEO: ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు
E.G: కొత్తపేటలోని RS కన్వెన్షన్ హాల్ వద్ద శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరెడ్డి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని నేతలు పిలుపునిచ్చారు.