మినీ గోకులం బిల్లులకు కోసం ఎదురుచూపులు

మినీ గోకులం బిల్లులకు కోసం ఎదురుచూపులు

PPM: పాలకొండ మండలంలో అధికారు భరోసాతో వేలాది రూపాయలు ఖర్చు చేసి తమకున్న పాడి పశువులకు మినీ గోకులాల నిర్మించుకున్న పాడి రైతులకు బిల్లులందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మినీ గోకులాలకు ప్రభుత్వం 90 శాతం రాయితీతో నగదు చెల్లిస్తుందని ఆశతో అప్పులు చేసి మరీ వీటిని నిర్మించుకున్నారు. వీటిని నిర్మించుకున్న పాడి రైతులంతా పేదలే కావడంతో వారి పాలిట ఈ పథకం శాపంగా మారింది.