నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ నిలుపుదల

శ్రీకాకుళం: బూర్జ మండలం కొల్లివలస 33/11 కే.వీ సబ్ స్టేషన్ మరమ్మతులతో పాటు విద్యుత్ లైన్లు మరమ్మతులు చేపట్టడంతో మండలంలోని చిన్నలంకాం, అన్నంపేట, తోటవాడ, నీలంపేట, అప్పలపేట తదితర గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేనున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.యోగేశ్వరరావు తెలిపారు.