స్వాతంత్య్ర దినోత్సవ రిహార్సల్స్‌ను పర్యవేక్షించిన SP

GDWL: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ గురువారం జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ టి.శ్రీనివాస రావు పర్యవేక్షించారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రధాన వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.