ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రతీ వార్డు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలిస్తూ, వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీ నిర్వహించారు.