ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాలోకి రవాణా కాకుండా కట్టడి చేయాలి

KMR: ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం రవాణా కాకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద గల చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం అక్రమంగా రవాణా కాకుండా గట్టి నిఘావేయాలని సూచించారు. మద్నూర్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు.