డెంగ్యూ వ్యాధిపై అవగాహన

NRML: భైంసా అర్బన్ పీహెచ్ సీలో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించారు.అనంతరం డా.ఫిర్దోస్, డా.కమలేష్ మాట్లాడుతూ దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ నరేష్, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏంలు పాల్గొన్నారు.