VIDEO: పెళ్లి పేరుతో యువతి ఘరానా మోసం
WGL: పెళ్లి పేరుతో డబ్బుతో, నగలతో మహిళ ఉడాయించిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన విజయవాడ చెందిన యువతి, పెళ్లి తర్వాత వరుడి కుటుంబం ఇచ్చిన రూ. 2 లక్షలు, 8 తులాల బంగారంతో పరారైంది. విచారణలో ఆమె వివరాలన్నీ ఫేక్ అని తెలిసి వరుడి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.