మొక్కజొన్న రైతులకు మద్దతు కోరుతూ డిమాండ్
JGL: జగిత్యాల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ధరఖాస్తు సమర్పించారు. మొక్కజొన్న సాగుకు ఎకరాకు సుమారు రూ. 30,000 ఖర్చవుతుందని, కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.