బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా నకరకంటి శివప్రసాద్
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింహులపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నకరకంటి శివ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఇవాళ గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.