విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NLG: చిట్యాల మండలం నేరడ జి.ప.ఉన్నత పాఠశాలలో 'బేటీ బచావో-బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి అమ్మాయి తనను తాను రక్షించుకుంటూ ఉన్నత చదువులు చదవాలని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబానికి వెలుగుగా నిలవాలని కోరారు.