గ్రామాభివృద్ధికి కృషి చేసిన కావేరికి సన్మానం
ADB: నార్నూర్ మండల కేంద్రంలో మంగళవారం సర్పంచ్ బానోత్ కావేరినీ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ISO ప్రశంసపత్రం అందుకున్న సందర్భంగా ఆమెకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ఆమె కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.