శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
GNTR: శ్రీ రామనవమి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తమీమ్ అన్సారియా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినం సందర్భంగా ప్రతి కుటుంబం ఆనందంగా, శాంతియుతంగా, ప్రజలు భద్రతా నియమాలను పాటిస్తూ పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని కోరారు. కాగా, నేడు సీతారాముల కళ్యాణం సందర్భంగా జిల్లాలో ఉదయం నుంచే పలు ఆలయాల్లో భక్తుల రద్ధీ నెలకొంది.