కనిగిరిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కనిగిరిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ప్రకాశం: కనిగిరిలోని పవిత్ర కళ్యాణమండపంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.