సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ
BDK: బూర్గంపాడు మండలం సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కిషోర్ శివరామ్ నాయక్ ఆధ్వర్యంలో పెండింగ్ పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ముత్యాలమ్మపేటకు చెందిన వెంకటేశ్వర్లుకు ఇళ్ల పట్టా అందజేశారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.