మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ
జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.