ప్రమాదంపై నవీన్ పొలిశెట్టి కామెంట్స్
'అనగనగా ఒకరాజు' మూవీ ప్రమోషన్స్‌లో తనకు జరిగిన ప్రమాదంపై నవీన్ పొలిశెట్టి స్పందించాడు. ప్రమాదం జరగడం వల్ల చేతికి, వెన్నెముకకు గాయాలయ్యాయని, ఏడాదిపాటు తాను కొత్త మూవీ షూటింగ్‌కు వెళ్లలేకపోయానని చెప్పాడు. ప్రేక్షకులను మళ్లీ ఎంటర్‌టైన్ చేయగలనా? లేదా? అని టెన్షన్ పడ్డానని, ప్రేక్షకుల ప్రేమ ఆశీస్సుల వల్ల మళ్లీ సెట్స్‌కు వెళ్లినట్లు పేర్కొన్నాడు.