అవినీతి పోలీసులపై సీపీ ఉక్కుపాదం
VSP: సీపీ శంఖబ్రత బాగ్చి జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్ల పై ఉక్కుపాదం మోపారు. గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు నాలుగు రోజుల ముందే సిద్ధమైనప్పటికీ, సంబంధిత స్టేషన్‌లకు నోటీసులు ఆలస్యంగా చేరినట్టు సమాచారం.