జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో శ్రీ అల్లా బకాష్ మియా ఉర్సును పురస్కరించుకుని ఈ నెల 5న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.16,016, రెండోది రూ.12,016, మూడోది రూ. 8,016, నాలుగోది రూ.4,016గా నిర్వాహకులు తెలిపారు.