విమానాశ్రయ ఊహాగానాలతో భూముల ధరలకు రెక్కలు

విమానాశ్రయ ఊహాగానాలతో భూముల ధరలకు రెక్కలు

GNTR: మేడికొండూరు, తాడికొండ మధ్య అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందనే ఊహాగానాలతో ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. ఒక సినీ నటుడు ఇటీవల ఈ మండలాల్లో 200 ఎకరాలు కొనుగోలు చేశారు. మరోవైపు 44వేల ఎకరాల భూ సమీకరణ ప్రతిపాదన పలు గ్రామాల్లో ఉంది. దీంతో ఎంపిక చేసిన భూములేవో తెలుసుకోవడానికి రైతులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నారు.