జేఎన్‌టీయూలో అత్యాధునిక ఎన్-జెన్ పోస్టాఫీస్ ప్రారంభం
ATP: అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని పోస్టాఫీస్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఎన్-జెన్ పోస్టాఫీస్‌గా మార్చారు. మంగళవారం వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు దీనిని ప్రారంభించారు. ఐఐటీల తర్వాత ఈ గౌరవం తమ వర్సిటీకే దక్కడం విశేషమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇకపై ఎన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని పోస్టల్ సూపరింటెండెంట్ కె.అమర్నాథ్ తెలిపారు.