జన్మదిన వేడుకల్లో కుప్పకూలి బాలుడి మృతి
SRCL: పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి మణిదీప్(15) కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. సాయినగర్‌కు చెందిన ప్రశాంత్–లావణ్య దంపతుల కుమారుడు మణిదీప్‌ను ఆసుపత్రికి తరలించగా, చేరుకునే లోపే మరణించినట్లు నిర్ధారించారు. ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.