మానవత్వం చాటుకున్న పోలీసులు
GNTR: తెనాలి కొత్తపేటలో ఆదివారం ఉదయం రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలాడు. మూర్ఛ వచ్చినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బందితో కలిసి అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు హైదరాబాద్‌కు చెందిన మాచిరాజు సాయిగా గుర్తించారు. పౌరోహిత్యం కార్యక్రమం కోసం తెనాలికి వచ్చినట్లు తెలిసింది.