నేడు జిల్లా వ్యాప్తంగా గృహ ప్రవేశాలు

నేడు జిల్లా వ్యాప్తంగా గృహ ప్రవేశాలు

VZM: జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కార్యక్రమం జరగనుంది.