రాక్షసత్వం.. చిన్నారిపై వేడినీళ్లు పోసేసింది
హోలీ రంగు చల్లడానికి వచ్చిన చిన్నారిపై ఓ వృద్ధురాలు తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టింది. మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని కోరాడి ప్రాంతంలో సింధు థాక్రేపై హరీశ్ వాంగే(4) వాటర్ గన్‌తో రంగు నీళ్లు చల్లబోయాడు. దీనిపై ఆగ్రహించిన ఆమె తన చేతిలోని వేడినీళ్లను అతనిపై పోసేసింది. దీంతో శరీరంపై 45% వరకు తీవ్ర గాయాలపాలైన వాంగే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.