'నందికొట్కూరు కర్నూలు జిల్లాలో కలపాలి'

'నందికొట్కూరు కర్నూలు జిల్లాలో కలపాలి'

NDL: నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరభయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కర్నూలు జిల్లాకు నందికొట్కూరు 28 కిలోమీటర్ల దూరం ఉండగా నంద్యాల జిల్లా 60 కిలోమీటర్లకు పైగా ఉందని, ఈ జిల్లాకు వెళ్లడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనని న్యాయవాదులు తెలిపారు.