రాజవొమ్మంగిలో రేపు MLA ప్రజా దర్బార్

రాజవొమ్మంగిలో రేపు MLA ప్రజా దర్బార్

ASR: రాజవొమ్మంగిలో శుక్రవారం రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రజాదర్బార్ నిర్వహిస్తారని మండల అధ్యక్షుడు పెద్దిరాజు గురువారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.