ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
MBNR: వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేత్కర్ కళాభవనంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వం సామాజిక న్యాయం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన సేవలు గొప్పవని పేర్కొన్నారు.