పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్
VZM: చీపురుపల్లి పంచాయతీలో ఇవాళ ఉదయం డైలీ మార్కెట్, కొత్త అగ్రహారం, కస్పా వీధి, సచివాలయం-5 పరిధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపట్టారు. ఈ పనులను శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ రావు పర్యవేక్షించారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను తరలిస్తున్నారు. ప్రజలు ఎక్కడబడితే అక్కడ చెత్త వేయరాదని, తడి, పొడికి ప్రత్యేక సంచులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.