అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్న పోలీసులు

SKLM: ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి నారాయణవలస సంతకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులను కంచిలి పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. కంచిలి జాతీయ రహదారిపై స్థానిక ఎస్సై పారినాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 11 గేదెలు,11 దూడలను పట్టుకున్నట్లు ఎస్సై పారినాయుడు తెలిపారు. పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.