TBJP సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు
TG: తెలంగాణ BJP సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిని 'వారణాసి' విలన్‌తో పోలుస్తూ మార్ఫింగ్ చేసిన ఫొటోను నిన్న TBJP పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు BJP సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై TBJP చీఫ్ రాంచందర్, కేంద్రమంత్రులు కిషన్, బండి అగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారంటూ మండిపడ్డారు.