దైవదర్శనాలకు వెళ్లేవారికి శుభవార్త

దైవదర్శనాలకు వెళ్లేవారికి శుభవార్త

HNK: శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాలకు జిల్లా నుంచి రాజధాని(AC) బస్సులు నడపనున్నట్లు WGL-1 డిపో మేనేజర్ విజయభాను తెలిపారు. ఈ సర్వీసు ఈనెల 14 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. HNK-శ్రీశైలానికి ఉ. 9 గం. బయలుదేరి సా. 6 గం. చేరుకుంటుందన్నారు. అలాగే, HNK-తిరుపతికి ఉ. 8 గం. బయలుదేరి మ. 11.10 గం. చేరుకుంటుందని, దైవదర్శనానికి వెళ్లే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.