'హరీష్‌రావును విడుదల చేయాలి'
SRCL: హరీష్ రావుతో సహా అందరిని విడుదల చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులను పరామర్శించడానికి వెళుతున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇతర నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.