యూరియా పంపిణీపై అధికారుల సమావేశం

MDK: రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీపై చర్యలు తీసుకోవాలని తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి సూచించారు. చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా కోసం రైతుల ధర్నా నేపథ్యంలో ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు.