రేపు శ్రీ రామాలయంలో కార్తీక దీపోత్సవం

రేపు శ్రీ రామాలయంలో  కార్తీక దీపోత్సవం

JGL: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని శ్రీ రామాలయంలో రేపు కార్తీక సోమవారం పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధన, హరినామస్మరణతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. మహిళలు స్థానిక చెరువులో దీపాలు విడువనున్నారు.