రైతులు రెండు పంటలు పండించుకునేందుకు నీరు విడుదల

రైతులు రెండు పంటలు పండించుకునేందుకు నీరు విడుదల

KMM: వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకునేందుకు వీలుగా రబీ పంట సాగుకు డిసెంబర్ మొదటి వారంలో కాలువల ద్వారా నీరు విడుదల చేస్తామని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మంగళవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ కెనాల్‌ను అనుసంధానం చేసి రిజర్వాయర్‌ను నిండుకుండలా ఉంచుతామన్నారు.