జాతీయ స్థాయి కోకో పోటీలకు.. అండర్ 14 బాలికల జట్టు

కామారెడ్డి: మహారాష్ట్రలోని కొలహాపూర్‌లో జరిగే జాతీయస్థాయి అండర్-14 బాలికల ఖోఖో పోటీలకు తెలంగాణ టీమ్ బయలుదేరి వెళ్లినట్లు కామారెడ్డి జిల్లా SGF సెక్రటరీ కె. హీరాలాల్ తెలిపారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు కామారెడ్డి జిల్లా పోసాని పేటలో ఇటీవల జరిగాయి. జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థినులు వెళ్లినట్లు ఆయన చెప్పారు.