అడ్డాకల్ టోల్ ప్లాజాలో నగదు రహిత చెల్లింపులు
MBNR: జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కోసం టోల్ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అడ్డాకల్ మండలంలోని 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద బుధవారం నుంచి నేరుగా నగదు చెల్లించే కౌంటర్లను తొలగించినట్లు అధికారి కార్తికేయ తెలిపారు. ఇకపై టోల్ రుసుమును కేవలం ఆన్‌లైన్ (ఫాస్టాగ్) ద్వారానే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.