నేడు భగీరథ మహర్షి జయంతి వేడుకలు

నేడు భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ఖమ్మం కలెక్టరేట్‌లోని బీసీ అభివృద్ధి కార్యాలయంలో గురువారం ఉదయం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహర్షి ఆశయాలను స్మరించుకుంటూ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.