గుంతల మయమైన కోళ్లమిట్ట రోడ్డు
NLR: ముత్తుకూరు నుంచి వెంకటాచలం వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి కోళ్లమిట్ట వద్ద రోడ్డు గుంతల మయమైంది. నిత్యం వందల వాహనాలు అటుగా ప్రయాణిస్తుంటాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే రహదారిపై గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.