హైడ్రా కూలగొట్టడానికే కాదు.. నిర్మించడానికి కూడా: సీఎం

HYD: హైడ్రా కూలగొట్టడానికే కాదు.. నిర్మించడానికి కూడా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగర భద్రత కోసం హైడ్రాను తీసుకొచ్చామన్నారు. కొందరు కావాలనే హైడ్రాను చెడుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.