హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్

హర్వర్డ్ వర్సిటీ వివాదంపై తప్పకుండా విజయం సాధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఈ వర్సిటీకి విడుదల చేసే నిధులను ట్రంప్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే హార్వర్డ్‌కు మూడు బిలియన్ డాలర్లు దక్కకుండా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ మొత్తాన్ని అమెరికాలోని ట్రేడ్ స్కూల్స్‌కు బదలాయించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.