రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ప్రకాశం: తర్లుపాడు-మార్కాపురం మధ్య రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.