'ప్రమాదల నివారణకు టైర్లు ఏర్పాటు'

'ప్రమాదల నివారణకు టైర్లు ఏర్పాటు'

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి సీజ్ టైర్లను శుక్రవారం అమర్చారు. ప్రమాదాలను అరికట్టేందుకు టైర్లకు రేడియం స్టిక్కర్లు అంటించి, విజయనగరం నుండి విశాఖ వెళ్లే జాతీయ రహదారి, చింతలవలస బెటాలియన్, జొన్నాడ, అయినాడ, మొదవలస జంక్షన్‌లలో ఏర్పాటు చేశారు.